భారతదేశానికి తొలి ఆస్కార్ తీసుకొచ్చిన అలనాటి బాలీవుడ్ కాస్టూమ్ డిజైనర్ భాను అథైయా మరణించారు. 91 ఏళ్ల ఆమె ముంబయిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2012 నుంచి ఆమె బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. రిచర్డ్ అటెన్‌బరో గాంధీ జీవిత చరిత్రపై తీసిన మహాత్మా గాంధీ చిత్రానికి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా 1983లో అకాడెమీ అవార్డు అందుకున్నారు భాను అథైయా. ఇది విదేశీయులు తీసిన చిత్రమైనప్పటికీ ఆస్కార్ చరిత్రలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా, అలాగే తొలి ఇండియన్‌గా భాను అతియా ఆస్కార్‌ని దక్కించుకున్నారు.
1950లలో కెరియర్ ప్రారంభించిన ఆమె 100కు పైగా చిత్రాలకు కాస్టూమ్ డిజైనర్‌గా పని చేశారు. గురుదత్, యశ్ చోప్రా, రాజ్ కపూర్ వంటి ప్రముఖల సినిమాలకు సేవలు అందించారు. 2001లో ఆస్కార్‌కు నామినేట్ అయిన భారతీయ సినిమా లగాన్‌కు కూడా ఆమె కాస్టూమ్స్ డిజైన్ చేశారు.