చిత్రకారుడు, చలనచిత్రకారుడు బాపు మలిచిన అందమైన ప్రేమ కథా చిత్రం తూర్పువెళ్ళేరైలు. తమిళ నటుడు మోహన్, జ్యోతి జంటగా నటించిన ఈ సినిమా 1979, ఆగస్ట్ 18నవిడుదలై అఖండ విజయం సాధించింది. త్రివేణీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై వి.పేర్రాజు నిర్మించిన ఈ సినిమాలో .. ఇంకా.. రాళ్ళపల్లి, సాక్షిరంగారావు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

అక్క, బావ సంరక్షణలో ఉన్న ఒక పల్లెటూరి అమ్మాయి.. అదే ఊరి అబ్బాయి ప్రేమలో పడుతుంది. ఆమెకు వేరే సంబంధం చేయాలనుకుంటారు. మరి పెద్దలను ఎదిరించి ఆ ప్రేమజంట ఇంట్లోవారిని, గ్రామస్థుల్ని ఒప్పించి  ఎలా పెళ్ళి చేసుకుంటారు? అన్నదే సినిమా కథ. అయితే వీరిద్దరి మధ్యా ట్రైన్ ప్రేమ రాయబారం నడిపించడం సినిమాకే హైలైట్. నిజానికి ఈ సినిమా భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘కిళక్కే పోగుమ్ రైల్ ’ తమిళ సినిమాకి రీమేక్ వెర్షన్. అందులో హీరోగా తెలుగు నటుడు సుధాకర్ నటించగా.. హీరోయిన్ గా రాధిక అభినయించింది. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించగా… తెలుగు వెర్షన్ కు యస్పీ బాలసుబ్రహ్మణ్యం అద్భుతమైన మెలోడీ ట్యూన్స్ కంపోజ్ చేశారు. చుట్టూ చెంగావి చీర, సందపొద్దు అందాలున్న, కో అంటే కోకిలమ్మ లాంటి పాటలు అప్పటి జనాన్ని ఉర్రూతలూగించాయి. ముళ్ళపూడి వెంకటరమణ సంభాషణలు సమకూర్చగా, జాలాది, ఆరుద్ర గీత రచన చేశారు.

Leave a comment

error: Content is protected !!