యంగ్ టైగర్ యన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దాదాపు రూ.450కోట్ల బడ్జెట్ తో జక్కన్న చెక్కుతోన్న ఈ హిస్టారిక్ ఫిక్షనల్ మూవీకి సంబంధించిన ప్రతీ అప్డేట్ నూ చాలా ఆసక్తిగా ఫాలో అవుతున్నారు అభిమానులు. అయితే రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ను ఆ మూవీ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ట్వీట్ చేశాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలోని యన్టీఆర్ మేకోవర్ కు సంబంధించిన ఫిట్ నెస్ ట్రైనింగ్ పూర్తయిందని, ఈ సినిమాలోని తన పాత్రకోసం యంగ్ టైగర్ చాలా హార్డ్ వర్క్ చేశాడని లాయిడ్ ప్రశంసించాడు.
అక్టోబర్ లో రాజమౌళి, లాయిడ్ స్టీవెన్స్ సమావేశమై.. ‘ఆర్.ఆర్,ఆర్’ మూవీలోని తారక్ మేకోవర్ గురించి చాలా సేపు డిస్కస్ చేసుకున్నారట. తారక్ ఎర్లియర్ మూవీ త్రివిక్రమ్ ‘అరవింద సమేత వీరరాఘవ’ లోనూ, అలాగే ‘టెంపర్’ చిత్రంలోనూ యన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ మేకోవర్ కు మూల కారకుడు అతడే. ఆ మూవీస్ లోని అతడి లుక్ కు అభిమానులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. అందుకే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోని యన్టీఆర్ కొమ్రం భీమ్ గెటప్ కోసం లాయిడ్ నే సంప్రదించాడు రాజమౌళి. ఆమేరకు ట్రైనింగ్ పూర్తి చేసి.. తనకు అప్పచెప్పిన పనికి లాయిడ్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడని ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ టీమ్ అంటోంది. ఈ ఏడాది జూలై 30న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి జక్కన్న ఇప్పటినుంచీ పక్కా ప్రణాళిక సిద్ధం చేశాడట.