ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని ఒణికిస్తోంది కరోనా వైరస్. మన దేశంలో దాని ప్రభావం తీవ్రమైన పరిస్థితుల్లో జనం సోషల్ డిస్టెన్సింగ్ ను మెయిన్ టెయిన్ చేస్తున్నారు. దానికి తోడు నిన్నటి రోజున జనతా కర్ఫ్యూ జరిగింది. ఈ రోజు నుంచి 31 వరకూ లాక్ డౌన్ అయి రవాణా సదుపాయాలు కూడా కట్ అయిన సంగతి తెలిసిందే.  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రముఖ కేరక్టర్ ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్ .. తన కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి మే నెల వరకూ జీతాలిచ్చేశారట.

ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా.. తన ఇంట్లోనూ , ఫామ్ హౌస్ లోనూ పనిచేస్తున్న సిబ్బందికి మేనెల వరకూ ఇవ్వాల్సిన  జీతాల్ని ముందే  చెల్లించేశాను. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన నా మూడు సినిమా షూటింగ్స్ నిమిత్తం పనిచేసే సిబ్బందికి కనీసం సగం జీతమైనా చెల్లించాలనే ఆలోచనలో ఉన్నానని, తానెంత వరకూ చేయాలగలనో అంతవరకే చేస్తానని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!