ఈ సంక్రాంతి సీజన్ టాలీవుడ్ ను  రెవెన్యూ పరంగా లాభాలతో ముంచెత్తింది. ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వురు’ చిత్రాలు రెండూ  దాదాపు రూ. 350కోట్ల ఇన్ కమ్  తెచ్చిపెట్టాయి. సంక్రాంతి సీజన్ అలా  నిర్మాతలకు వరంగా మారింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ దృష్టి సమ్మర్ పై పడింది. పలు చిత్రాలు ఈ వేసవిని టార్గెట్ చేసుకొని బరిలోకి దిగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా విడుదల తేదీలు లాక్ చేసుకొన్న ఆ చిత్రాల  పోరు చాలా రసవత్తరంగా ఉండబోతోంది.

ముందుగా ‘మహానటి’ ఫేమ్  కీర్తి సురేశ్ ఈ సమ్మర్ సమరాన్ని ‘మిస్ ఇండియా’ చిత్రంతో ప్రారంభించనుంది. ఈ సినిమా మార్చ్ 6న విడుదల కానుందని సమాచారం. నానీ, సుధీర్ బాబు, ఇంద్రగంటి చిత్రం ‘వి’ మార్చ్ 25న ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. శర్వానంద్ ‘శ్రీకారం’ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కాబోతోంది( ఈ సినిమా విడుదల వాయిదా పడే అవ కాశాలున్నాయి). మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ ‘ఉప్పెన’ చిత్రం కూడా అదే డేట్లో విడుదల కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సైతం తన ‘రెడ్’ చిత్రంతో ఏప్రిల్ 9న సమ్మర్ బరిలోకి దిగబోతున్నాడు. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి నటిస్తోన్న  ‘లవ్ స్టోరీ’ మూవీ  ఏప్రిల్ 17న విడుదల కాబోతోంది.  అలాగే సాయిధర్మతేజ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ఏప్రిల్ 24న బెర్త్ కన్ఫార్మ్ చేసుకుందని టాక్. విక్టరీ వెంకటేశ్ రివెంజ్ స్టోరీ  ‘నారప్ప’ చిత్రం  మే1 న మేడే కానుకగా విడుదల కాబోతోంది. ఇక అదే నెల్లో  రవితేజ క్రాక్, పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్, నాగార్జున ‘వైల్డ్ డాగ్’ చిత్రాలు కూడా  విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. మరి ఈ సమరంలో సమ్మర్ సీజన్ విజేతలు ఎవరవుతారో చూడాలి.

Leave a comment

error: Content is protected !!