ప్రస్తుతం టాలీవుడ్ కమెడియన్స్ లో సూపర్ సీనియర్ ఎవరైనా ఉన్నారంటే.. ఆలీ మాత్రమే. ఎప్పుడో ఎయిటీస్ లో తెలుగు తెరమీద తన నటనా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆలీ.. ఇప్పటి వరకూ వెయ్యి పై చిలుకు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు అతడి కూతురు వంతు వచ్చింది. బేబీ జువేరియాను బాలనటిగా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు. వి.బాలనాగేశ్వరరావు దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న ‘మా గంగానది’ అనే చిత్రంతో ఆమె పరిచయం కానుంది.

స్త్రీ గొప్పతనాన్ని చాటిచెప్పే కథనంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. ఇందులో ఆలీ హీరోగా నటిస్తున్నాడు. అందులో మరో ముఖ్యమైన చైల్డ్ పాత్రకు ఆలీ కూతురు బేబీ జువేరియా ఎంపికయింది. ఎప్పుడూ తన కుటుంబానికి అత్యధిక విలువనిచ్చే ఆలీ.. ఇప్పుడు తన కూతురుని సినీ తెరకు పరిచయం చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు. ఆలీ 1109 వ చిత్రంగా  రూపొందుతోన్న ఈ సినిమా ఆలీకి, అతడి కూతురికి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!