అశ్వథ్థామ చిత్రంతో మంచి విజయం ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. అదే ఉత్సాహంతో మరికొన్ని చిత్రాల్ని ట్రాక్ ఎక్కించే పనిలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. మనోడు జనతా కర్ఫ్యూ రోజున ఇంట్లో కూర్చుని ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. చక్కగా తన తల్లి దగ్గర ఆవకాయ కలపడం ఎలాగో నేర్చుకొని మరీ ఆవకాయ కలిపేశాడు. నాగశౌర్య ఆవకాయ కలుపుతుంటే.. ఎవరో అనుభవజ్నులు కలుపుతున్నట్టు అనిపించడం విశేషం.
ప్రస్తుతం నాగశౌర్య ఆవకాయ వీడియో ట్విట్టర్ లో భలేగా వైరల్ అయింది. చాలా మంది ఆ వీడియో కు రెస్పాండ్ అయి.. నాగశౌర్య చేస్తున్న పనిని అప్రిషియేట్ చేశారు. అమ్మ , ఆవకాయ ఎప్పుడూ బోర్ కొట్టవని త్రివిక్రమ్ పేల్చిన డైలాగ్ ఇప్పుడు గుర్తుకు వస్తోంది కదూ. నాగశౌర్య మదర్ కూడా ఎంతో ఓఫిగ్గా శౌర్య చేత దగ్గరుండి మరీ ఆవకాయ కలిపించడం విశేషం.
Avakai…♥♥
Learning from mom#Avakai #Homemade #JanathaCurfew #DayWithFamily pic.twitter.com/xQ2ifqaDGF— Naga Shaurya (@IamNagashaurya) March 22, 2020