మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో ‘చక్రవర్తి’ చాలా ప్రత్యేకం. 1987లో విడుదలైన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. వసంత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.వెంకటేశ్వరరావు నిర్మాణంలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో భానుప్రియ కథానాయికగా నటించింది. ఇంకా .. మోహన్ బాబు, జె.వి.సోమయాజులు, సత్యనారాయణ, సుత్తివేలు, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. చక్రవర్తి సంగీత సారధ్యంలోని పాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

అంజి ( చిరంజీవి ) మోటు మనిషి. అతనికి చెల్లెలు  లక్ష్మి ( రమ్య కృష్ణ ) అంటే చాలా ఇష్టం. అతని ఊళ్ళో, ఒక స్వామీజీ ( జె.వి. సోమయజులు ) అనేక మంది అనాథలకు ఆశ్రయం కల్పిస్తాడు. అంజీకి చిన్ననాటి స్నేహితుడు మోహన్ ( మోహన్ బాబు ) పోలీస్ ఇన్స్పెక్టర్ గా  ఆ గ్రామానికి వస్తాడు. ఆ గ్రామ ప్రెసిడెంటు ఆశ్రమాన్ని ఏదో రకంగా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తాడు. అతను ఆశ్రమానికి నిప్పు పెడతాడు. పిల్లలను రక్షించే ప్రయత్నంలో అంజి తన ఎడమ కన్ను కోల్పోతాడు. అంజి సోదరిని వివాహం చేసుకోవాలని స్వామీజీ మోహన్‌ను అభ్యర్థిస్తాడు. అయితే లక్ష్మి అప్పటికే తన క్లాస్‌మేట్ ప్రేం బాబుతో ప్రేమలో ఉంది. కానీ, ప్రేంబాబు అసహ్యంగా ప్రవర్తించినప్పుడు, అంజి అతన్ని చితగ్గొడతాడు. ప్రేంబాబు తరువాత మరణిస్తాడు. ఇప్పుడు, ఇన్స్పెక్టర్ మోహన్ చిరంజీవిని అరెస్టు చేయవలసి వస్తుంది. ఇంతలో, స్వామీజీ ఆలయ ఆభరణాల దొంగ అనే నెపంతో గ్రామంలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తారు. ఈ కుట్ర వెనుక గ్రామ ప్రెసిడెంటు ఉన్నాడు. అకస్మాత్తుగా, ప్రపంచ ప్రఖ్యాత డిస్కో డాన్సరు చక్రవర్తి ఆ గ్రామానికి వస్తాడు. అతడు మారువేషంలో ఉన్న అంజియే. ప్రేంబాబు హత్య కేసులో తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటాడు. అన్ని చెడు సంఘటనలకు ప్రెసిడెంటే దోషిని అని తేలుతుంది. అతన్ని అరెస్టు చేస్తారు. మోహన్ లక్ష్మిని పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది. నిజానికి ఈ సినిమా తమి:ళంలో శివాజీగణేశన్ ప్రధాన పాత్రలో నటించిన ‘జ్ఞానఓళి’ చిత్రానికి రీమేక్ వెర్షన్. ఆ సినిమా కూడా లిస్ మిసరబుల్స్ నవలకి అడాప్టేషన్.

 

Leave a comment

error: Content is protected !!