Shopping Cart 0 items - $0.00 0

గుడిలో మెగాస్టార్ ఫైట్

 

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతోన్న యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ‘ఆచార్య’. తన సినిమాలతో సమాజానికి కేవలం ఒక మంచి మెసేజ్ ను ఇవ్వడమే కాక.. అదిరిపోయే ఫైట్ సీక్వెన్సెస్ ను కూడా మేజర్ హైలెట్స్ గా తీర్చిదిద్దడం కొరటాలకు ఫ్రేమ్ తో పెట్టిన విద్య. ‘మిర్చి’లో ప్రభాస్ రైన్ ఫైట్, ‘శ్రీమంతుడు’లో మహేశ్ మామిడితోటల ఫైట్ , ‘జనతా గ్యారేజ్’ లో యన్టీఆర్ మున్సిపల్ ఆఫీస్ ఫైట్ , ‘భరత్ అనే నేను’ లో మహేశ్ థియేటర్ ఫైట్ ఆయా సినిమాలకే హైలైట్స్ గా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో కూడా కొరటాల ఒక బ్రహ్మాండమైన ఫైట్ సీక్వెన్స్ ను డిజైన్ చేశాడట.

ఒక గుడి లోపల ఈ ఫైట్ సీన్ వస్తుందట. అయితే  ఈ ఫైట్ తో దేవాలయ పవిత్రత కు  ఏ మాత్రం భంగం రాకుండా  కొరటాల అన్ని జాగ్రత్తలు తీసుకోవడం  విశేషం. ‘ఆచార్య’ సినిమాకే ఈ ఫైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా మొత్తం మీద మూడు ఫైట్స్ ఉండబోతున్నాయని సమాచారం. దేవాదాయ శాఖలో ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ గా చిరంజీవి తన నట విశ్వరూపాన్ని చూపించనున్నారని సమాచారం . దేవాలయ భూముల  విషయంలో జరిగుతున్న అవినీతిపై చర్యలు తీసుకొనే ఒక పవర్ ఫుల్ పాత్రట అది.   త్రిష కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరి ‘ఆచార్య’ చిత్రానికి టెంపుల్  ఫైట్ ఏ స్థాయిలో హైలైట్ కానుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!