దర్బార్’ తో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన ఏ.ఆర్. మురుగదాస్ .. తదుపరి చిత్రం ఏంటనే చర్చ సౌత్ ఇండస్ట్రీస్ లో వాడిగా వేడిగా జరుగుతోంది. అదే సమయంలో మురుగ దృష్ణి ఇప్పుడు ‘గజినీ 2’ మీద పడిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. సూర్య హీరోగా మురుగదాస్ మలిచిన యాక్షన్ థ్రిల్లర్ ‘గజినీ’ ఏ రేంజ్ లో హిట్టయిందో తెలిసిందే. తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో పాటు ఆమిర్ ఖాన్ తో తెరకెక్కించిన బాలీవుడ్ రీమేక్ వెర్షన్ కూడా కాసుల వర్షం కురిపించింది. తన కెరీర్ ను ఎన్నోరెట్లు లిఫ్ట్ చేసిన ఆ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు మురుగదాస్. అయితే ఆ సీక్వెల్ లో ఏ హీరో నటించబోతున్నాడని ఆసక్తి అంతటా ఉంది.
తాజా సమాచారం ప్రకారం మురుగదాస్ రెండో గజినీ బన్నీ యే అని తెలుస్తోంది. దర్బార్ డిస్ట్రిబ్యూటర్స్ తమకు జరిగిన నష్టానికి మురుగదాస్ , లైకా సంస్థలు పరిహారం చెల్లించాలని వెంటపడ్డారు. నిజానికి ఆ టైమ్ లో మురుగా సారువాడు గీతా ఆర్ట్స్ ఆఫీస్ లోనే ఉన్నాడని తెలుస్తోంది . అక్కడ ‘గజినీ 2’ గురించి తీవ్రంగా చర్చలు జరిగాయట. అల్లు అర్జున్ కోసం మురుగదాస్ ఓ సూపర్ స్ర్కిప్ట్ ప్రిపేర్ చేశాడట. ప్రస్తుతం దాన్ని లాక్ చేసే పనిలో అతడున్నాడని వినికిడి. మురుగదాస్ తో గజినీ హిందీ వెర్షన్ ను నిర్మించిన అల్లు అరవింద్ కూడా అతడితో మరో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడట. అందుకే అరవింద్ మురుగదాస్ ను, బన్నీని ‘గజినీ 2’ కోసం సెట్ చేశాడనే వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదండోయ్.. ‘గజినీ 2’ టైటిల్ ను కూడా గీతా ఆర్ట్స్ వారు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేసేశారట. సో… ముమ్మాటికీ మురుగదాస్ రెండో గజినీ బన్నీయే అన్నమాట.