మాస్ మహారాజా రవితేజ ..  జయాపజయాలతో సంబంధం లేకుండా తదుపరి చిత్రాల మీద మెయిన్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ హీరోగా క్రాక్ సినిమా సెట్స్ మీదుండగా..ఆ తర్వాత రమేశ్ వర్మ సినిమా కూడా లైన్ లో ఉంది. ఇంకా మరికొన్ని చిత్రాల్ని ప్రయారిటీలో పెట్టుకున్నాడు . అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ టైమ్ నడుస్తోంది కాబట్టి.. సినిమా ల షూటింగ్స్ ఏమీ లేక.. ఇంట్లోనే ఉన్నారు రవితేజ .

ఇన్నాళ్ళూ షూటింగ్స్ బిజీ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ తో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం సాధ్యకాలేదు. ఇప్పుడు ఆయనకి మంచి అవకాశమొచ్చింది. రవితేజ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ కొడుకు మహాధన్ తోనై, కూతురు మోక్షదతోనూ భలేగా కాలక్షేపం చేస్తున్నారు. కొడుకు మహాధన్ రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజగా నటించాడు. అలా చాలా మందికి పరిచయం అయ్యాడు జూనియర్ రవితేజ. కానీ కూతురు మోక్షద మాత్రం ఎక్కడా బయటికి రాలేదు.. కనిపించలేదు కూడా. అక్కడక్కడా చిన్ననాటి ఫోటోలు కనిపించడమే కానీ ఇప్పుడు ఎలా ఉందనేది మాత్రం ఎవరికీ ఐడియా ఉండదు. ఇప్పుడు రవితేజ స్వయంగా తన కొడుకు, కూతురుతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇంట్లోనే ఉండండి అంటూ తన పిల్లలతో దిగిన ఫోటోను పోస్ట్ చేసారు మాస్ రాజా. ఈ ఫోటో చూసిన తర్వాత వామ్మో రవితేజకు ఇంత పెద్ద కూతురు ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

Leave a comment

error: Content is protected !!