కరోనా వైరస్ ఇప్పుడు 195 దేశాలకు పైగా వ్యాపించి ఇప్పుడు ఇండియాలోనూ తిష్టవేసుకు కూర్చున్న సంగతి తెలిసిందే.  దాంతో  ఈ వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇక భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు.. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ నుండి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు కోట్ల విరాళం ఇవ్వగా, చిరంజీవి రూ.1 కోటి, పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళం, రామ్ చరణ్ 75 లక్షలు, ఎన్టీఆర్ 75 లక్షలు, అల్లుఅర్జున్ కోటి 25 లక్షల విరాళం ఇచ్చారు.

ఇక బాలీవుడ్ నుంచి హీరో అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏలాంటి విపత్కర పరిస్థితి వచ్చిన ఆర్థిక సహాయం చేసేందుకు అక్షయ్ కుమార్ ముందుంటారు. తాజాగా కరోనా వైరస్ పై దేశం చేస్తున్న పోరాటంలో తన వంతుగా 25 కోట్ల విరాళం ప్రకటించి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. “ప్ర‌జ‌ల జీవితాల‌ని కాపాడుకోవ‌ల‌సిన స‌మ‌యం వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో మ‌న‌కి తోచినంత సాయం చేయాలి అని అక్ష‌య్ అన్నారు. పీఎం కేర్స్ ఫండ్‌కి అక్ష‌య్ రూ.25 కోట్ల విరాళాన్ని అందించారు. అక్ష‌య్ సాయాన్ని అభినందిస్తూ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ .. భార‌తదేశాన్ని కాపాడుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రం విరాళాలు ఇద్ధాం” అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. అక్షయ్ కుమార్ ఇంత భారీ మొత్తంలో విరాళం ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Leave a comment

error: Content is protected !!