కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్ తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. అయితే ఇప్పుడు కరోనాపై సంగీత దర్శకుడు కీరవాణి వినూత్నంగా తన సందేశాన్ని తెలిపాడు.
కరోనాపై ఓ పాటను విడుదల చేశారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నం.1 సినిమాలోని ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’ పాటను పేరడీ చేసి కరోనాపై ఆయన కొత్త పాటను విడుదల చేశారు. అందులో కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఇంటి దగ్గరే ఉండండంటూ ఆయన సూచించారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. కాగా గతంలో నమస్కారం గొప్పదనం చెబుతూ కీరవాణి చెప్పిన ఓ కవిత.. కరోనా వైరస్ నేపథ్యంలో మళ్లీ ఈ మధ్యన వైరల్ అయిన విషయం తెలిసిందే.
కీరవాణి పారడీ వీడియో సాంగ్ ను వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.
https://www.youtube.com/watch?v=MaUCWz-Iyzc&feature=emb_logo