టాలీవుడ్ లో వరుసగా  బ్లాక్ బస్టర్స్ సాధించి టాప్ సంస్థగా ఎదిగింది మైత్రీ మూవీ క్రియేషన్స్. ఈ సంస్థ ఇప్పుడు కరోనా బాధితుల సహాయార్ధం ముందుకొచ్చి భారీ విరాళాలు అందజేసింది. రెండు తెలుగు రాష్ట్రాలకు .. ఒకో రాష్ట్రం చొప్పున రూ. 10లక్షలు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి.  మన తెలుగు ప్రజలు లాక్ డౌన్ తో ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రోజు కూలి చేసుకొనే వారు ఈ సిట్యువేషన్స్ ను ఫేస్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారికి అండగా నిలబడి ఆదుకోవడానికి ముందుకొచ్చారు. 

ఇప్పటికే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం భారీ విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విధంగా నిర్మాత దిల్ రాజు – హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థలు కూడా ముందుకొచ్చి విరాళాలు అందించాయి.

Leave a comment

error: Content is protected !!