కరోనా వైరస్ కంట్రోలింగ్ లో భాగంగా కేంద్రప్రభుత్వం విధించిన లాక్ డౌన్  వల్ల  సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ త‌రుణంలో పేద సినీ కార్మికులను కాపాడ‌టానికి సినీ ప్ర‌ముఖులు ముందుకొచ్చారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ’క‌రోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ సినీ క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డానికి ప్ర‌ముఖులు ముందుకు రావాల‌ని సూచించారు. 

 ఇప్పటికే కరోనా క్రై సిస్‌ చారిటీకి కింగ్‌ నాగార్జున కోటీ రూపాయల విరాళం అందజేశారు. మహేశ్‌బాబు రూ. 1.25 కోట్లు విరాళం ప్రకటించారు. అలాగే రామ్‌ చరణ్‌ రూ. 30 లక్షలు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు రూ.70 లక్షలను ప్రకటించారు, దగ్గుపాటి ఫ్యామిలీ రూ.1 కోటి ప్రకటించారు. తాజాగా మాస్‌ మహారాజా  రవితేజ కూడా సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తనవంతు సహాయంగా రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని కరోనా క్రై సిస్‌ చారిటీస్‌కు అందిస్తున్నటు ప్రకటించారు. అలాగే సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కూడా రూ.10 లక్షలను విరాళంగా అందజేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి సాయి ధరమ్ తేజ  రూ. 10 లక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

Leave a comment

error: Content is protected !!