ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ నివారణ కోసం కేంద్రం 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమవంతు సాయం చేస్తున్నారు. వీరికి సినీ నటులు కూడా అండగా నిలుస్తున్నారు.ఇప్పటికే చాలా మంది సినిమా నటులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు.
తాజాగా భారతరత్న గాన కోకిల లతా మంగేష్కర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్టు ప్రకటించించారు. దేశ వ్యాప్తంగా ఎక్కువగా కరోనా కేసులు కేరళ, మహారాష్ట్రలోనే ఎక్కువగా నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో లతా మంగేష్కర్ తన వంతుగా సాయం ప్రకటించడం గమనార్హం.
नमस्कार.आपण आपल्या सरकारला या कठिण प्रसंगी मदत करणे हे आपले कर्तव्य आहे. मी माझ्या तर्फ़े मुख्यमंत्री सहाय्यता निधीला २५ लाख रुपये देत आहे. माझी सर्वांना नम्र विनंती आहे की सरकारच्या क़ोरोना विरोधी लढ्यात आपण सुद्धा सरकारला यथाशक्ति मदत करावी.
— Lata Mangeshkar (@mangeshkarlata) March 31, 2020