మెగాస్టార్ చిరంజీవి ప్రస్తతుం 152వ చిత్రమైన ఆచార్యలో నటిస్తోన్న  సంగతి తెలిసిందే. కరోనా ఔట్ బ్రేక్ కారణంగా ‘ఆచార్య’ షూటింగ్ ను కొద్దిరోజులు ఆపేస్తున్నట్టు ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతను ప్రశంసిస్తూ .. మిగతా హీరోలు కూడా స్వచ్ఛందంగా  తమ తమ షూటింగ్స్ ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరు కరోనా జాగ్రత్తల్ని వివరిస్తూ.. ఒక వీడియో షూటింగ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

కరోనా వైరస్ మనల్ని ఏదో చేస్తుందని భయపడాల్సిన పనిలేదని, అలాగే మనల్నేం చేస్తుందనే నిర్లక్ష్యం తగదని చెబుతూ.. చేతుల్ని వీలైనన్ని సార్లు కడుక్కోవాలని,  దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా టిష్యూ పేపర్ నో , కర్చీఫ్ నో అడ్డుపెట్టుకొని.. వాటిని జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో పాడేయాలని సూచించారు. ఇక కరోనా ఔట్ బ్రేక్ ఉండేరోజులన్నీ వీలైనంత వరకూ ఇంటివద్దనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ..ఇంకా ఎవరికీ షేక్ హ్యాండివ్వొద్దని, మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం పెట్టాలని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆలోచింపచేస్తోంది.

చిరంజీవి వీడియో కోసం కింది లింక్ మీద క్లిక్ చేయండి

https://twitter.com/vamsikaka/status/1240533227799863296

Leave a comment

error: Content is protected !!