Shopping Cart 0 items - $0.00 0

ఇద్దరు హీరోలకు తల్లిగా శివగామి

 

బాహుబలి’ లో శివగామిగా తన నటవిశ్వరూపం ప్రదర్శించి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రమ్యకృష్ణ .. ఆ క్రెడిట్ తో దక్షిణాదిన  ప్రత్యేకపాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఇటీవల ‘క్వీన్’ వెబ్ సిరీస్ లో  జయలలిత పాత్రను పోషించి మెప్పించిన రమ్యకృష్ణ. ఇప్పుడు తెలుగులో ఓ ఇద్దరు స్టార్ హీరోలకు తల్లిగా నటించనుంది. ఆ హీరోలు మరెవరో కాదు మెగా ప్రిన్స్ .. వరుణ్ తేజ,  రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

వరుణ్ తేజ హీరోగా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్  చిత్రం ‘బాక్సర్’ . ఇందులో బాక్సింగ్ ఛాంపియన్ గా సరికొత్త మేకోవర్ తో రానున్న వరుణ్ తేజకు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తోంది. రినైసెన్స్ పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధు మద్దా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అలాగే.. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న వెరైటీ యాక్షన్ చిత్రం ‘లైగర్’. ఇందులో విజయ్ తల్లిగా శివగామి ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తోన్నట్టు వార్తలొస్తున్నాయి. మరి వరుణ్, విజయ్ చిత్రాలు రమ్యకృష్ణ తల్లి పాత్రలతో  ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాయో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!