మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీపై రోజుకో సరికొత్త అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందులో ఒకటి మోహన్ బాబు కొత్త లుక్. ‘గాయత్రి’  తర్వాత ఆయన ఇంతవరకూ  మరే చిత్రంలోనూ నటించలేదు. మరి ఈ లుక్ ఎక్కడినుంచి వచ్చిందనే ఆరా మొదలైంది అభిమానుల్లో. నెరిసిన గెడ్డం, కన్నింగ్  లుక్  చూస్తుంటే.. ఇది కచ్చితంగా చిరు ‘ఆచార్య’  చిత్రానికి సంబంధించిందే అయి ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

చిరంజీవి 152 చిత్రంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సామాజిక సందేశాత్మక చిత్రం లో మోహన్ బాబు పాత్ర  ఆయనకు ధీటుగా ఉండబోతోందని .. ఇందులో విలక్షణ నటుడి విలనిజం ఓ రేంజ్ లో ఉండబోతోందని కొందరు అంటుంటే.. ఆయనది చాలా పాజిటివ్ కేరక్టర్ అని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఆయన పాత్ర ఏదైనా.. మళ్లీ తెరమీద ఆ ఇద్దరు లెజెండ్స్  కలసి నటించబోతున్నందుకు.. ఎయిటీస్ లోని వారిద్దరి పాత్రల్ని తిరిగి కళ్ళముందుకు తెస్తున్నందుకు  అభిమానులు ఫిదా అయిపోతున్నారు.  ఈ సినిమాలో  దేవాదాయ శాఖలోని అవినీతిని, అక్రమాల్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు దర్శకుడు కొరటాల. కచ్చితంగా మోహన్ బాబుది దానికి సంబంధించిన దుష్టపాత్రే అయి ఉంటుందని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. మరి మోహన్ బాబు లుక్ ‘ఆచార్య’ చిత్రానికి సంబంధించిందో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Leave a comment

error: Content is protected !!