చిత్రం : ‘అశ్వథ్థామ’
నటనటులు: నాగశౌర్య, మెహ్రీన్ కౌర్, పవిత్రా లోకేశ్, జయప్రకాశ్, సురేఖా వాణి, హరీశ్ ఉత్తమన్, జిషు సేన్ గుప్తా, పోసాని కృష్ణ మురళి, సివీయల్ నరసింహారావు, విశ్వనాథ్ కాశీ, మధుమణి తదితరులు
సంగీతం : శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి
బ్యానర్ : ఐరా క్రియేషన్స్
కథ : నాగశౌర్య
నిర్మాతలు : ఉష ముల్పూరి
స్ర్కీన్ ప్లే దర్వకత్వం : రమణ తేజ
విడుదల తేదీ : జనవరి 31, 2020
‘ఊహలు గుసగుసలాడే , ఛలో’ లాంటి చిత్రాలతో యూత్ లో మంచి పేరు తెచ్చుకున్న యంగ్ హీరో నాగశౌర్య.. ఎర్లియర్ గా ‘నర్తన శాల’తో నిరాశచెందాడు. అందుకే ఈాాసారి రొటీన్ ప్రేమకథలకు ఫుల్ స్టాప్ పెట్టి.. ఒక థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేయాలనుకున్నాడు. ఆ క్రమంలో సొంత కథతో, సొంత బ్యానర్ లో ‘అశ్వథ్థామ’ చిత్రంతో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి శౌర్య ప్రయత్నం ఎంత వరుకూ సక్సెస్ అయింది? ‘అశ్వథ్ధామ’ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు థ్రిల్ చేస్తుంది? చూద్దాం.‘
కథ:
గణ (నాగశౌర్య) కి చెల్లెలంటే చాలా ఇష్టం. విదేశాల్లో ఉంటోన్న అతడు ఆమె నిశ్చితార్ధం కోసం ఇంటికొస్తాడు. నిశ్చితార్ధం జరిగిన రాత్రి చెల్లెలు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. గర్భవతిననే షాకింగ్ విషయం చెబుతుంది. అయితే దానికి కారణమేంటో ఆమెకు తెలియదు. ఆమె స్పృలో లేనప్పుడు అది జరిగిందని తెలుసుకుంటాడు గణ. అయితే ఆమెలాగానే నగరంలో మరికొందరు అమ్మాయిలు ఇలాగే తమకు తెలియకుండా గర్భవతులై ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. అసలు దీని వెనుక ఎవరు ఉన్నారు? వాళ్ళ మోటివ్ ఏంటి? అనేదే మిగతా కథ.
కథనం విశ్లేషణ :
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ టేకప్ చేసినప్పుడు లైన్ ఎలాంటిదైనా .. దాన్ని గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో, రేసీ సీన్స్ తో , అడుగడున సస్పెన్స్ తో ఆ తర్వాత ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీతో ప్రేక్షకుల్ని క్లైమాక్స్ వరకూ కూర్చోబెట్టగలగాలి . ఎట్ ది సేమ్ టైమ్ .. ఒకో సీన్ నూ ముందు నుంచీ లాక్ చేసుకుంటూ వెళుతూ.. ఇంటర్వెల్ తర్వాత నుంచి అన్ లాక్ చేసుకుంటూ రావాలి. క్లైమాక్స్ లో సీక్రెట్ విప్పాలి. అలా కాకుండా.. గుట్టు ముందే విప్పేస్తే హీరోకి, విలన్ కి మధ్య పోటా పోటీగా మైండ్ గేమ్ లాంటిదైనా ప్లాన్ చేయాలి. ‘అశ్వథ్థామ’ విషయంలో దర్శకుడు రమణతేజ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేద్దామనుకున్నాడు కానీ.. అందులో కొంత మేరకే సక్సెస్ అయ్యాడు.
అమ్మాయిలు తమకు తెలియకుండానే గర్భవతులవుతూ.. ఆత్మ హత్య చేసుకోవడం అనే పాయింట్ ఇన్నోవేటివ్ గానే ఉంది. అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు కాస్తంత తడబడ్డాడు. అమ్మాయిల్ని స్రృహ తప్పించి.. ఒక హాస్పిటల్ లో జాయిన్ చేసి .. తిరిగి డిస్చార్జ్ చేసి ఇంటికి పంపించడం అనే ప్రాసెస్ ను ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్ గా ఆపరేట్ చేస్తుంటాడు అసలు సూత్రధారి. ఏదో మోటివ్ తోనే ఇదంతా చేయిస్తున్నాడని ప్రేక్షకుడు ఫీలవుతాడు. అంతేకాదు దీని వెనుక మెడికల్ పరంగా ఏదో లింక్ కూడా ఉంటుందని అనుకుంటాడు. ఇంట్రవెల్ వరకూ ఆ ప్రాసెస్ చాలా గ్రిప్పింగ్ గా సాగుతుంది. దాని మీద కథానాయకుడు ఇన్వెస్టిగేట్ చేసే తీరు కూడా ఆసక్తిని రేపుతుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ దగ్గర వచ్చే ఫైట్ సైతం ఆకట్టుకుంటుంది.
అయితే సెకండాఫ్ బిగిన్ అయిన కొద్ది నిమిషాలకే దీని వెనుక ఉన్నదెవరో రివీల్ అయిపోతుంది. దాంతో కథనం కాస్తంత నెమ్మగిస్తుంది. అయితే ఇటు హీరో , అటు విలన్స్ మధ్య అసలు ఘర్షణే లేకపోవడంతో .. ఒకదశలో చాలా చప్పగా సాగుతుంది కథనం. అంతేకాదు ప్రీ క్లైమాక్స్ వరకూ అసలు సూత్రధారిని ట్రేస్ చేయడానికి చాలా కష్టపడిన హీరో .. క్లైమాక్స్ లో చాలా తేలిగ్గా అతడ్ని పట్టుకొని చంపేస్తాడు. అసలు నాగశౌర్య హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికే క్లైమాక్స్ ను ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. హీరో, విలన్ మధ్య ఛాలెంజ్ లాంటిది ఉండి ఉంటే.. ఈ సినిమా మరోలా ఉండేదేమో. అన్న, చెల్లి సెంటిమెంట్ ను చాలా లైటర్ వేలో ఎస్టాబ్లిష్ అవడంతో .. హీరో పడే స్ట్రగుల్ సాధారణంగా అనిపిస్తుంది. అలాగే ‘అశ్వథ్థామ’ టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వడానికి దర్శకుడిచ్చిన మహాభారత రిఫరెన్స్ అసలు కథతో సింకే అవదు. మొత్తానికి ‘అశ్వథ్థామ’ చిత్రం పూర్తి స్థాయిలో కాకపోయినా.. కొంతమేరకు జనాన్ని థ్రిల్ చేస్తుంది.
నటీనటుల పెర్పార్మెన్స్ :
గణ గా నాగశౌర్య తనదైన శైలిలో నటించి బాగానే మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ ను బాగా చేశాడు. అలాగే రొమాంటిక్ , సెంటిమెంట్ సీన్స్ ను కూడా బాగానే పండించాడు. ఒక థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ను మెప్పించాలనే కసి, పట్టుదల సినిమా మొత్తం అతడిలో కనిపించింది. ఇక కథానాయికగా మెహ్రీన్ పర్వాలేదనిపిస్తుంది. ఇక విలన్ గా నటించిన జిషు సేన్ గుప్తా ఓకే అనిపిస్తాడు. హరీశ్ ఉత్తమన్ పాత్ర జనానికి షాకిస్తుంది. ఇంకా ఇతర నటీనటులు తమదైన స్థాయిలో నటించారు.
సాంకేతిక నిపుణులు :
శ్రీచరణ్ పాకాలా సంగీతం పర్వాలేదనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఏమంత ఎఫెక్టివ్ గా లేదు. మనోజ్ రెడ్డి కెమేరా పనితనం మెచ్చుకోదగ్గది. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్సెస్ లో అతడి ఫ్రేమింగ్స్ బాగున్నాయి. సినిమాకు మంచి రిచ్ నెస్ తెచ్చిపెట్టేలా అతడి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మొత్తం మీద థ్రిల్లర్స్ ను ఇష్టపడేవారిని అశ్వథ్థామ మూవీ బాగానే ఎంగేజ్ చేస్తుంది.
రేటింగ్ : 3
బోటమ్ లైన్ : ‘అశ్వథ్థామ’ థ్రిల్ చేస్తాడు. కానీ…..
review by : రామకృష్ణ క్రొవ్విడి