‘అల వైకుంఠపురములో’’ చిత్రం తర్వాత అల్లు అర్జున్ .. సుకుమార్ దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఎర్రచందనం’ స్మగ్లింగ్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో సుక్కూ ఈ సినిమాను తనదైన స్టైల్లో తెరకెక్కించనున్నాడు. మార్చ్ లో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. ఒక పాత్ర గుబురు గెడ్డం లుక్ లో రఫ్ అండ్ టఫ్ గా ఉంటే.. మరో పాత్ర దానికి పూర్తి వ్యతిరేకంగా క్లీన్ షేవ్ తో క్లాస్ లుక్ లో ఉంటుందట. అంతేకాదండోయ్.. బన్నీ మాస్ పాత్ర .. లారీ డ్రైవరట.
రష్మికా మందణ్ణ కథానాయికగా నటించనున్న ఈ సినిమాకి ‘శేషాచలం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని గతంలో వార్తలొచ్చాయి. తిరుమల దగ్గరున్న శేషాచలం అడవుల చుట్టూ తిరిగే కథ కాబట్టి.. దానికి ఈ టైటిలే యాప్ట్ అని సుకుమార్ టీమ్ భావిస్తోందట. గతంలో ‘ఆర్య’, ‘ఆర్య2’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ, సుక్కూ కాంబో .. ఈ మూవీతో హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నారు. ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ తో సుక్కూ, ‘అల.. వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ తో బన్నీ చేయబోతున్న సినిమా ఇదే అవడంతో అభిమానుల్లో అంచనాలు మాముగా లేవు. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందో చూడాలి.