ఒకో సినిమాకి చక్కటి నటీనటులు కుదిరినా.. ఒకోసారి పరాజయం తప్పదు. అలాంటి సినిమాలు తెలుగులో చాలానే ఉన్నా… మనసేమందిరం సినిమా ఎందుకు ప్లాప్ అయిందో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో అక్కినేని, జగ్గయ్య, సావిత్రి లాంటి మేటి నటీనటులు  అద్భుతంగా  అభినయించారు.

దర్శక నిర్మాత, రచయిత సి.వి.శ్రీధర్‌ తమిళంలో ‘నెంజిల్‌ ఓర్‌ ఆలయమ్‌’  అనే చిత్రం తీస్తే, చాలా పెద్ద హిట్‌ అయింది. కల్యాణ్‌ కుమార్, ముత్తురామ్‌కి, దేవిక, నాగేష్, బేబి పద్మిని ముఖ్యనటులు. విశ్వనాథ్‌ – రామ్మూర్తి సంగీతం. ఇదే సినిమాని శ్రీధరే ‘దిల్‌ ఏక్‌ మందిర్‌’ అనే పేరుతో హిందీలో తీస్తే అదీ హిట్టయింది. ఇదే సినిమా తెలుగులో ‘మనసే మందిరం’ పేరుతో తీస్తే పరాజయం పాలయింది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, రేలంగి, మొదలైన తారలు ఉండి కూడా ఆ సినిమా అపజయం పాలు ఎందుకయిందో ఎవరికీ అర్థం కాలేదు! నటులు, డిష్ట్రిబ్యూటర్లు అందరూ ఈ సినిమా పరాజయం పొందడం పట్ల చర్చించేవారు. ‘‘అది, ఈ నాటికీ సమస్యే’’ -అని ఇప్పుడు కూడా అంటూ ఉంటారు. ఆ రెండు చిత్రాలూ డైరక్ట్‌ చేసిన శ్రీధరే -ఈ తెలుగు సినిమా కూడా డైరక్టు చేశారు .

 

Leave a comment

error: Content is protected !!